logo

ఆ రూపం.. భక్తజన సమ్మోహితం

శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మోహినీ అవతార ఉత్సవం నిర్వహించారు.

Published : 24 Mar 2023 02:44 IST

కొడంగల్‌: శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మోహినీ అవతార ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ధరూరి శ్రీనివాసాచార్యులు మోహినీ రూప విశిష్టతను భక్తులకు తెలిపారు. క్షీరసాగర మధనం జరిగినప్పుడు వెలువడిన అమృతాన్ని రాక్షసులకు అందకుండా చేసేందుకు స్వామివారు ఈ రూపాన్ని ధరించారన్నారు. అందుకోసం భక్తులు ఈ రూపంలో స్వామివారిని నేరుగా చూడకుండా స్వామి ప్రతిబింబాన్ని అద్దంలో చూడాలన్నారు. ఉత్సవంలో సైతం స్వామి ముందు దర్పణం ఏర్పాటు చేసి భక్తులు అందులో చూసేందుకు అనుమతిచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనతోపాటు కౌన్సిలర్‌ మధుసూదన్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు