logo

రైతులకు త్వరలోనే నష్టపరిహారం: ఎమ్మెల్యే

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందుతుందని స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పేర్కొన్నారు.

Published : 24 Mar 2023 02:44 IST

ఉల్లి పంటను పరిశీలిస్తున్న ఆనంద్‌, భారాస నేతలు, రైతులు

మోమిన్‌పేట: అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందుతుందని స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మండల పరిధిలోని చిన్న కోల్కొంద, కొత్త కొల్కొంద, అమ్రాదికలాన్‌, గ్రామాలలో దెబ్బతిన్న పంటలను ఆయన గురువారం భారాస నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందే విధంగా చూస్తామన్నారు. అధికారులు పరిశీలించి పూర్తి స్థాయిలో నివేదికలు పంపించాలన్నారు. దాని ఆధారంగా ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం అందిస్తుందన్నారు. ఆయన వెంట భారాస మండల అధ్యక్షులు వెంకట్‌, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

మర్పల్లి, న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఆయన మర్పల్లి మండలం మర్పల్లి తండా, మర్పల్లి మండల కేంద్రంలో పర్యటించారు. పాడుబడ్డ ఇళ్లు, పిచ్చిమొక్కలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణ ఎప్పటికప్పుడు చేయాలని సూచించారు. విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.రైతుబీమా పథకం ద్వారా మండల కేంద్రంలో 25 మందికి రూ.1.25కోట్లు పంపిణీ చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని