logo

సైన్యం పేరుతో సైబర్‌ మోసం!

ఆర్మీ అంటే ప్రజల్లో ఎంతో గౌరవం ఉంటుంది. సైబర్‌ నేరగాళ్లకు ఇదే వరంగా మారుతోంది. ఆర్మీ విభాగాలు, శిక్షణ సంస్థలకు వివిధ వస్తువులు సరఫరా చేయాలంటూ నకిలీ వేషాలతో నమ్మించి డబ్బు లాగేస్తున్నారు.

Published : 24 Mar 2023 02:44 IST

నగరంలో పెరుగుతున్న ఘటనలు

ఈనాడు- హైదరాబాద్‌: ఆర్మీ అంటే ప్రజల్లో ఎంతో గౌరవం ఉంటుంది. సైబర్‌ నేరగాళ్లకు ఇదే వరంగా మారుతోంది. ఆర్మీ విభాగాలు, శిక్షణ సంస్థలకు వివిధ వస్తువులు సరఫరా చేయాలంటూ నకిలీ వేషాలతో నమ్మించి డబ్బు లాగేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌లోనూ ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది రెండు నెలల్లో దాదాపు 25 కేసులు నమోదయ్యాయి.

హైదరాబాదీలే లక్ష్యంగా.. నగరంలో పెద్ద సంఖ్యలో ఆర్మీ, రక్షణ రంగ పరిశోధన సంస్థలు ఉన్నాయి. దీనికితోడు ఇక్కడ ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు. దీన్ని సైబర్‌ నేరస్థులు అవకాశంగా తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో వివిధ వస్తువులు, ఉత్పత్తులు సరఫరా చేసే సంస్థల ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు. ఆర్మీలో ఉన్నత స్థాయి అధికారుల పేర్లతో ఫోన్లు చేస్తున్నారు. సరఫరా కాంట్రాక్టు దక్కించుకోవాలంటే ఒప్పందం చేసుకోవాలని నమ్మబలుకుతున్నారు. వ్యాపారులు నమ్మినట్లు అనిపించగానే.. ముందు కొంత డబ్బు కట్టాలంటూ.. జీఎస్‌టీ, వివిధ ఛార్జీల పేరిట రూ.లక్షలు దండుకుంటున్నారు. కొందరు నిందితులు ఓఎల్‌ఎక్స్‌ల ఆర్మీ అధికారి ప్రొఫైల్‌ రూపొందించి వాహనం, ఫ్లాటు విక్రయిస్తామంటూ పోస్టు చేస్తున్నారు. ఎవరైనా సంప్రదిస్తే.. ఫోన్‌లో బేరం మాట్లాడుకుంటారు. వస్తువు డెలివరీ చేయాలని కోరితే సమీపంలోని ఆర్మీ బేస్‌ క్యాంపులో లేదా మరో ఆర్మీ పార్శిల్‌లో పంపిస్తామని చెబుతారు. అడ్వాన్సు చెల్లించాలంటూ పేమెంట్‌ లింకులు పంపిస్తారు. డబ్బు కట్టాక ఫోన్లు ఆపేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు