logo

సైబరాబాద్‌లో పోలీస్‌ క్రీడలు ప్రారంభం

క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని, విధి నిర్వహణలో మరింత చురుగ్గా వ్యవహరించడంలో పోలీసులకు ఆటలు ఎంతో ముఖ్యమని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు.

Published : 24 Mar 2023 02:40 IST

క్రీడాకారులతో కరచాలనం చేస్తున్న  సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

రాయదుర్గం, న్యూస్‌టుడే: క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని, విధి నిర్వహణలో మరింత చురుగ్గా వ్యవహరించడంలో పోలీసులకు ఆటలు ఎంతో ముఖ్యమని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో సైబరాబాద్‌ పోలీస్‌ వార్షిక క్రీడా పోటీలను కమిషనర్‌ గురువారం ప్రారంభించారు. పావురాలు, గాలిబుడగలను ఎగురవేశారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిషనరేట్‌లో క్రీడలను ప్రోత్సహిస్తూ ఏటా పోటీలు నిర్వహిస్తున్నామని, ఆటగాళ్లు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ ప్రతిభ చాటుతున్నారన్నారు. జాయింట్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి మాట్లాడుతూ ఆటలు, శారీరక వ్యాయామాలను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. కమిషరేట్‌లోని అన్ని జోన్లతో పాటు ట్రాఫిక్‌, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ జట్ల మధ్య వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, కబడ్డీ తదితర క్రీడలతోపాటు అథ్లెటిక్స్‌ పోటీలు మూడు రోజుల పాటు సాగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని