logo

Crime News: వివాహేతర సంబంధం బెడిసికొట్టి విద్యార్థి ఆత్మహత్య

పెళ్లయి పిల్లలున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఓ విద్యార్థి ఆత్మహత్యకు దారి తీసింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్‌కు చెందిన లగిశెట్టి అభిషేక్‌(19) డిగ్రీ చదువుతూ హైదరాబాద్‌ సుచిత్ర ప్రాంతంలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్నాడు.

Updated : 24 Mar 2023 06:59 IST

అభిషేక్‌

కొండపాక, న్యూస్‌టుడే: పెళ్లయి పిల్లలున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఓ విద్యార్థి ఆత్మహత్యకు దారి తీసింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్‌కు చెందిన లగిశెట్టి అభిషేక్‌(19) డిగ్రీ చదువుతూ హైదరాబాద్‌ సుచిత్ర ప్రాంతంలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్నాడు. అక్కడే ఓ వివాహితతో పరిచయమై, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆమె మరొకరితో చనువుగా ఉండటం సహించలేని అభిషేక్‌ మానసికంగా కుంగిపోయాడు. మంగోల్‌లో పొలం వద్ద ఈ నెల 17న పురుగు మందు తాగాడు. తల్లిదండ్రులు గమనించి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని