logo

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై.. విద్యార్థులు ఉద్యమించాలి: ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై విద్యార్థులు భారీస్థాయిలో ఉద్యమించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సూచించారు.

Published : 24 Mar 2023 02:40 IST

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతున్న బీఎస్పీ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై విద్యార్థులు భారీస్థాయిలో ఉద్యమించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో గురువారం ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని, తెలంగాణ ఏర్పాటు తరువాత జరిగిన అన్ని ఉద్యోగాల భర్తీపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన కోసం విద్యార్థుల ఆధ్వర్యంలో మరో తెలంగాణ ఉద్యమ స్థాయి ఉద్యమం జరగాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని