logo

నైతిక విలువలు, సమయ పాలనతో విజయం

కార్పొరేట్‌ రంగంలో నైతిక విలువలకు తోడు సమయ పాలన పాటించడం ద్వారా విజయం సాధించవచ్చని చైనా, దుబాయి, మారిషస్‌, సింగపూర్‌, మలేసియా, శ్రీలంక దేశాల విజిటింగ్‌ ప్రొఫెసర్‌, ఐపీఈ విశ్రాంత ప్రొఫెసర్‌ ఎంఎల్‌ సాయికుమార్‌ తెలిపారు.

Published : 24 Mar 2023 02:40 IST

ప్రొ. సాయికుమార్‌ను సన్మానించిన సురేంద్ర లూనియా, ఎస్‌బీ కాబ్రా

గోల్నాక, న్యూస్‌టుడే: కార్పొరేట్‌ రంగంలో నైతిక విలువలకు తోడు సమయ పాలన పాటించడం ద్వారా విజయం సాధించవచ్చని చైనా, దుబాయి, మారిషస్‌, సింగపూర్‌, మలేసియా, శ్రీలంక దేశాల విజిటింగ్‌ ప్రొఫెసర్‌, ఐపీఈ విశ్రాంత ప్రొఫెసర్‌ ఎంఎల్‌ సాయికుమార్‌ తెలిపారు. గురువారం చాదర్‌ఘాట్‌ ఆర్‌జీ కేడియా వాణిజ్య కళాళాలలో ‘క్యాంపస్‌ టూ కార్పొరేట్‌’ అనే అంశంపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ పునర్నిర్మాణం, అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచీకరణ పోటీని తట్టుకుని విద్యార్థులు రాణించాలన్నారు. మార్వాడీ శిక్షా సమితి కార్యదర్శి సురేంద్రలూనియా, సంయుక్త కార్యదర్శి సీఏ ఎస్‌బీ కాబ్రా, పరిశోధన డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వందన, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీహరి, వైస్‌ ప్రిన్సిపల్‌ కమలేశ్‌ మిత్తల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని