logo

గ్రంథాలయ వ్యవస్థలో సమూల మార్పులు రావాలి

గ్రంథాలయ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక విధానాలు అమలు చేసేలా సమూల మార్పులు అవసరమని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌-ఐపీఈ హైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌మూర్తి పేర్కొన్నారు.

Published : 24 Mar 2023 02:40 IST

ప్రసంగిస్తున్న శ్రీనివాసమూర్తి

శామీర్‌పేట, న్యూస్‌టుడే: గ్రంథాలయ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక విధానాలు అమలు చేసేలా సమూల మార్పులు అవసరమని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌-ఐపీఈ హైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌మూర్తి పేర్కొన్నారు. గురువారం శామీర్‌పేటలోని ఐపీఈలో ‘లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ వర్క్‌ వ్యవస్థాపకత’ అంశంపై రెండురోజుల జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. ఆధునిక కాలంలో లైబ్రరీలకు పాఠకులు వెళ్లే పరిస్థితి లేదని.. ఈ-పత్రిక, యూట్యూబ్‌పై ఆధారపడుతున్నారన్నారు. తొలుత వీడియో కాన్ఫరెన్స్‌లో దిల్లీ ఐసీఎస్‌ఎస్‌ డైరెక్టర్‌ రమేశ్‌ శరనాధుల ప్రసంగిస్తూ.. పలు సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమ కన్వీనర్‌ జి.వెంకటనాగయ్య, కో-కన్వీనర్‌ ప్రార్థనకుమార్‌, వివిధ రాష్ట్రాల సీనియర్‌ లైబ్రేరియన్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు