logo

ప్రైవేట్‌ కళాశాలలకు బకాయిలు విడుదల చేయాలి: టీపీజేఎంఏ

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలలకు 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌(ట్యూషన్‌ ఫీజు) నిధులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం(టి.పి.జె.ఎం.ఎ) రాష్ట్ర అధ్యక్షుడు, కేజీ టు పీజీ మిషన్‌ కన్వీనర్‌ గౌరిసతీష్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Published : 24 Mar 2023 02:40 IST

మాట్లాడుతున్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్‌

నాంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలలకు 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌(ట్యూషన్‌ ఫీజు) నిధులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం(టి.పి.జె.ఎం.ఎ) రాష్ట్ర అధ్యక్షుడు, కేజీ టు పీజీ మిషన్‌ కన్వీనర్‌ గౌరిసతీష్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం నాంపల్లిలోని ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ కాంప్లెక్స్‌లోని టి.పి.జె.ఎం.ఎ కార్యాలయంలో సంస్థ ప్రతినిధులు, జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. 2021-22, 2022-23 సంవత్సరాల బకాయిపడ్డ ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ రూ.326 కోట్ల నిధులను నేటికీ చెల్లించలేకపోయిందన్నారు. సంస్థ ప్రతినిధులు చంద్రయ్య, ఇంద్రసేన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సీతారాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఉస్మాన్‌, ట్రెస్మా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎన్‌.రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని