logo

డంపింగ్‌యార్డు సమస్య.. వాయిదాల పర్వం

ఏళ్లు గడుస్తున్నా.. జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు సమస్య కొలిక్కి రావట్లేదు. రెండేళ్లుగా ఎన్జీటీ(జాతీయ హరిత ట్రైబ్యునల్‌)లో కేసు వాయిదాలు పడుతూనే ఉంది.

Published : 24 Mar 2023 02:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏళ్లు గడుస్తున్నా.. జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు సమస్య కొలిక్కి రావట్లేదు. రెండేళ్లుగా ఎన్జీటీ(జాతీయ హరిత ట్రైబ్యునల్‌)లో కేసు వాయిదాలు పడుతూనే ఉంది. ఎందుకంటే.. సీపీసీబీ(కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) కమిటీ నివేదిక రావాల్సి ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏప్రిల్‌లో చెన్నై ఎన్జీటీలో జరగనున్న విచారణకు జీహెచ్‌ఎంసీ ఏం సమాధానం చెబుతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. దిల్లీ ఎన్జీటీ ఆదేశాల ప్రకారం డంపింగ్‌యార్డులో బయోమైనింగ్‌ చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ లేవనెత్తిన అభ్యంతరాలపై.. ఆరు నెలల క్రితం సీపీసీబీ కమిటీ సమీక్ష జరపగా, సమీక్ష నివేదిక ఇప్పటికీ విడుదల కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. అదే సమయంలో.. బయోమైనింగ్‌ ఎలా చేపట్టాలి, చేపట్టేందుకు గల అవకాశాలపై ముంబయి ఐఐటీ నిపుణులు చేపట్టిన ప్రాథమిక అధ్యయన నివేదిక కూడా విడుదల కావాల్సి ఉంది. ఆయా నివేదికలు వెల్లడి కాకుండా.. చెన్నై ఎన్జీటీకి జీహెచ్‌ఎంసీ ఏమని జవాబిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ దఫా కూడా జీహెచ్‌ఎంసీ సరైన వివరణ ఇవ్వకపోతే.. ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశముందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు