logo

బీసీ గణన చేయకపోతే పార్లమెంట్‌ ముట్టడి తప్పదు

బీసీ గణన చేయకపోతే పార్లమెంట్‌ ముట్టడి తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 24 Mar 2023 02:40 IST

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: బీసీ గణన చేయకపోతే పార్లమెంట్‌ ముట్టడి తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బీసీ గణన డిమాండ్‌తో నిర్వహించే చలో దిల్లీ గోడపత్రికను ఓయూలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండుతో ఈనెల 28న దిల్లీలో మహాధర్నా, 29న బీసీ జనగణన దీక్ష చేస్తామని ప్రకటించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ, బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మణిమంజరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని