logo

నేర వార్తలు

పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి వికారాబాద్‌కు వెళ్తున్న పల్నాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. జేమ్స్‌స్ట్రీట్‌- సంజీవయ్య పార్కు రైల్వేస్టేషన్ల మధ్యకు రైలు రాగానే.. ఓ వ్యక్తి(50) పట్టాలపై పడుకున్నాడు.

Published : 24 Mar 2023 02:40 IST

వేర్వేరు రైళ్ల కిందపడి ఇద్దరి ఆత్మహత్య

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి వికారాబాద్‌కు వెళ్తున్న పల్నాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. జేమ్స్‌స్ట్రీట్‌- సంజీవయ్య పార్కు రైల్వేస్టేషన్ల మధ్యకు రైలు రాగానే.. ఓ వ్యక్తి(50) పట్టాలపై పడుకున్నాడు. రైలు అతడిని ఢీకొట్టగా అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వద్ద చిరునామా గుర్తింపు వివరాలు ఏమీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

* మల్కాజిగిరికి సమీపంలోని దయానంద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై గురువారం ఉదయం నిలబడిన ఓ వ్యక్తి(35).. అప్పుడే వస్తున్న అకోలా ఎక్స్‌ప్రెస్‌ రైలు ముందుకు ఒక్కసారిగా దూకాడు. వేగంగా వస్తున్న రైలు అతడిని ఢీకొనగా అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభ్యంకాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.


సంపులో పడి బాలుడి మృతి

చేవెళ్ల గ్రామీణం:   సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన   చేవెళ్ల  ఠాణా పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల  ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన రాజుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు వినయ్‌ చారి(4) గురువారం మధ్యాహ్నం ఇంటి బయట  ఆడుకున్నాడు. తిరిగి ఇంట్లోకి వస్తూ ఇంటి ముందు ఉన్న సంపు తెరిచి ఉండటంతో అందులో పడిపోయాడు. కొద్ది సేపటికి బాలుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. సంపులో చూడగా అందులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని