కనిపెట్టి.. లక్ష్యాన్ని గురిపెట్టి
కళ్లముందే క్షిపణులు.. రాకెట్‌లాంచర్లు.. పెద్ద పెద్ద డ్రోన్లు.. లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆకాశంలో వేల కిలోమీటర్లు దూసుకెళ్లే మిస్సైల్స్.. నదులు, సముద్రాల్లో చేపలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో తెలిపే ఉపగ్రహ చిత్రాలు... మనం అంతరిక్షంలోకి వెళ్లి విహరించే తీరును వివరించే గగన్‌యాన్... ఇలా నలువైపులా ఆసక్తికరమైన అంశాలన్నీ ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ కళాశాలలోని ప్రదర్శనలో కొలువుదీరాయి.
విజ్ఞాన ప్రదర్శనలో క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు
ఆసక్తిగా తిలకించిన యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, ఉస్మానియా యూనివర్సిటీ
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన క్షిపణులు
కళ్లముందే క్షిపణులు.. రాకెట్‌లాంచర్లు.. పెద్ద పెద్ద డ్రోన్లు.. లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆకాశంలో వేల కిలోమీటర్లు దూసుకెళ్లే మిస్సైల్స్.. నదులు, సముద్రాల్లో చేపలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో తెలిపే ఉపగ్రహ చిత్రాలు... మనం అంతరిక్షంలోకి వెళ్లి విహరించే తీరును వివరించే గగన్‌యాన్... ఇలా నలువైపులా ఆసక్తికరమైన అంశాలన్నీ ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ కళాశాలలోని ప్రదర్శనలో కొలువుదీరాయి. ఇస్రో, డీఆర్‌డీవో, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ సిస్టమ్ ఫర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ హైదరాబాద్ చాప్టర్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఈ విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థులు ఇప్పటివరకు చూడని యంత్రాలు.. పరికరాలు.. సాంకేతిక పరిజ్ఞానం కనిపించింది. ఓయూ విద్యార్థులు, ఇస్రో, డీఆర్‌డీవో యువ శాస్తవేత్తలు ఆసక్తికరంగా ప్రదర్శనను తిలకించారు.
ఎక్కడ దాక్కున్నా..
తిలకిస్తున్న విద్యార్థులు
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన క్షిపణులు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను సైతం అంతం చేస్తాయి. ఇందులో మూడు కీలక క్షిపణులున్నాయని అధికారులు తెలిపారు. ఒక క్షిపణి గాలిలోంచి గాలిలోకి దూసుకెళ్లి శత్రుదేశాల డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, విమానాలను నాశనం చేస్తే.. మరొకటి గాల్లోంచి నేలపైకి దూసుకెళ్తుంది. ఇంకో క్షిపణి శత్రువులు భూమిపై ఉన్నా.. ఆకాశంలో ఉన్నా.. సముద్రంలో దాక్కున్నా వదలకుండా అంతమొందిస్తుంది.
కంటికి కనిపించకుండా నిఘా..
ఆధునిక డ్రోన్లు
మైదాన ప్రాంతాలు.. అడవుల్లో మనుషులు.. జంతువులు.. శత్రువుల జాడను రహస్యంగా పసిగట్టేందుకు సైన్యం డ్రోన్లను ఉపయోగిస్తోంది. దీంతోపాటు ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటికంటే భిన్నంగా సైన్యం అవసరాలకు గుట్టుగా నిఘా వేసే డ్రోన్లను ఐగన్ ల్యాబ్స్ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ తరహాలో ఉండే ఈ డ్రోన్ భూమి నుంచి 500మీటర్ల ఎత్తు వరకూ వెళ్లి.. మనుషులు, వాహనాలు, వస్తువులను స్పష్టంగా చిత్రీకరిస్తుంది. ఇందులోని ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ కారణంగా ఈ డ్రోన్‌ను శక్తివంతమైన రాడార్లు తప్ప సాధారణ రాడార్లు పసిగట్టలేవు.
మనమూ వెళ్దాం... అంతరిక్షంలోకి...
గగన్‌యాన్ నమూనా
రష్యా, అమెరికా, చైనా దేశాలు అంతరిక్షంలోకి మనుషులను పంపుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశంగా పేరొందిన మనం ఇంకా అంతరిక్షంలోకి వెళ్లకపోతే ఎలా?.. ఈ ఆలోచనతో గగన్‌యాన్‌ను ఇస్రో రూపొందించింది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న గగన్‌యాన్ ఈ ఏడాది ఆఖరుకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశాలున్నాయి.ప్రత్యేకంగా తయారు చేసిన సూట్‌లో ఇద్దరు వ్యక్తులను నిర్ణీత కక్ష్య ద్వారా అంతరిక్షంలోకి పంపుతారు. నాలుగు నుంచి ఏడురోజుల పాటు వారు అంతరిక్షంలోనే ఉంటారు. అక్కడి వాతావరణాన్ని ప్రత్యేక సూట్‌లో ఏర్పాటు చేసిన చిన్నపాటి పరికరాలు, సెన్సర్ల ద్వారా తెలుసుకుని తిరిగి భూమిపైకి వస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Prakasham: హనుమాయమ్మ హత్య కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు: డీజీపీ ఆదేశం
-
India News
Fact-checking: జులై 10వరకు ఫ్యాక్ట్‌చెక్ యూనిట్‌పై ముందుకు వెళ్లం.. బాంబే హైకోర్టులో కేంద్రం
-
Crime News
Nellore: కందుకూరులో దారుణం.. మహిళపై ముగ్గురు అత్యాచారయత్నం
-
India News
Borewell: బోరుబావిలో రెండేళ్ల చిన్నారి.. మరో 50 అడుగులు లోతుకు జారిపోయి..!
-
General News
AP Cabinet: ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం
-
World News
Crime News: కాల్ సెంటర్లో దారుణం.. ఉద్యోగం మానేస్తున్నారని 8 మంది హత్య!