logo

కేంద్రీయ విశ్వవిద్యాలయానికి విశ్వవ్యాప్త గుర్తింపు

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి విశ్వవ్యాప్త గుర్తింపు లభించింది. విశ్వవిద్యాలయాల్లో వివిధ సబ్జెక్టుల బోధన తీరు తెన్నులపై సర్వే నిర్వహించిన అంతర్జాతీయ ఉన్నత విద్య నెట్‌వర్క్‌ సంస్థ క్వాక్వరెల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) శుక్రవారం ప్రకటించిన ర్యాంకుల్లో హెచ్‌సీయూకు స్థానం లభించింది.

Published : 25 Mar 2023 02:33 IST

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి విశ్వవ్యాప్త గుర్తింపు లభించింది. విశ్వవిద్యాలయాల్లో వివిధ సబ్జెక్టుల బోధన తీరు తెన్నులపై సర్వే నిర్వహించిన అంతర్జాతీయ ఉన్నత విద్య నెట్‌వర్క్‌ సంస్థ క్వాక్వరెల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) శుక్రవారం ప్రకటించిన ర్యాంకుల్లో హెచ్‌సీయూకు స్థానం లభించింది. ఇందులో భాగంగా 2023వ సంవత్సరానికి ప్రకటించిన ర్యాంకుల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 301-340 పాయింట్ల విభాగంలో ర్యాంకు దక్కించుకుంది. ఆంగ్లభాష, సోషియాలజీ, సాహిత్యం సహా ఐదు సబ్జెక్టుల్లో ఉత్తమంగా నిలిచింది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చిన పాయింట్ల ఆధారంగా దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఐదో స్థానం సంపాదించింది. ప్రపంచంలోని 1,594 ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని కోర్సులు, 15,703 మంది వ్యక్తిగత ప్రతిభ, 54 విద్యా సంబంధమైన అంశాలను క్యూఎస్‌ సంస్థ పరిగణలోకి తీసుకుంది.

హెచ్‌సీయూను పోటీలో నిలిపిన అంశాలు

* ఉత్తమ పరిశోధన పత్రాల విభాగంలో రసాయన శాస్త్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు, విద్యార్థులు సమర్పించిన పరిశోధన పత్రాల విభాగంలో 75.3 పాయింట్లు దక్కాయి.
* వృక్షశాస్త్ర విభాగంలో హెచ్‌-సూచిక, పరిశోధన పత్రాల విభాగంలో 58.1 పాయింట్లు లభించాయి.
* ఉత్తమ బోధనలో ప్రముఖ విదేశీ వర్సిటీలతో పోటీపడి సోషియాలజీ విభాగంలో 64.3 పాయింట్ల స్కోర్‌ సాధించింది. వృక్షశాస్త్ర విభాగంలో 45.9 పాయింట్లు లభించాయి.
* అంతర్జాతీయ పరిశోధన నెట్‌ వర్కింగ్‌లో రసాయన శాస్త్ర విభాగం 48.3 పాయింట్లు స్కోర్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు