logo

కేజీ సీఎన్జీ రూ.100

నగరంలో కంప్రెస్డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌(సీఎన్జీ) ధర రూ.100(రూ.99.99)కు చేరుకుంది. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు వాహనదారులు మొగ్గు చూపుతుండగా తాజాగా సీఎన్జీ ధర కూడా అదే స్థాయిలో ఎగబాకుతుండటం వాహనదారుల్లో అసహనాన్ని పెంచుతోంది.

Published : 25 Mar 2023 02:23 IST

ఉస్మానియా క్యాంపస్‌ మాణికేశ్వర్‌ నగర్‌ వద్ద ఏర్పాటు
చేసిన హెచ్‌పీ పెట్రోల్‌ బంకులో సీఎన్జీ గ్యాస్‌ ఫిల్లింగ్‌ కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో కంప్రెస్డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌(సీఎన్జీ) ధర రూ.100(రూ.99.99)కు చేరుకుంది. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు వాహనదారులు మొగ్గు చూపుతుండగా తాజాగా సీఎన్జీ ధర కూడా అదే స్థాయిలో ఎగబాకుతుండటం వాహనదారుల్లో అసహనాన్ని పెంచుతోంది. పెట్రోల్‌, డీజిల్‌తో పోల్చితే తక్కువ ఖర్చు ఎక్కువ మైలేజీ ఉంటుందని భావించి నగరంలో చాలా మంది వాహనదారులు తమ ఇంధన ట్యాంకులను సీఎన్జీకి మార్చుకున్నారు. ఆయిల్‌ కంపెనీల నివేదికల ప్రకారం.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సీఎన్జీ వినియోగం రెట్టింపైంది. గతేడాది తెలంగాణ వ్యాప్తంగా 11,550 టన్నుల సీఎన్జీ వినియోగించగా... ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 26,790 టన్నులకు చేరుకుంది. ఇందులో 70 శాతం అంటే 18 వేల టన్నులు నగరంలోనే వినియోగిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 50 సీఎన్జీ ఫిల్లింగ్‌ కేంద్రాలుండగా ప్రతిరోజూ 3 వేల కేజీలు విక్రయిస్తుంటారు. దీనికి తోడు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో సీఎన్జీ గ్యాస్‌ డిమాండ్‌ పెరుగుతోంది. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ద్వారా 15 నుంచి 18 కిలోమీటర్ల మైలేజీ వచ్చే వాహనానికి.. కేజీ సీఎన్జీతో 25 నుంచి 28 కిలోమీటర్ల వరకు వస్తున్నప్పటికీ ధరలో పెద్దగా వ్యత్యాసం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో సీఎన్జీ వాహనాలు

* బల్దియాలో వినియోగిస్తున్న చెత్త తరలింపు వాహనాలు - 100
* సీఎన్జీ బస్సులు - 135
* కార్లు - 3,000
* ఆటోలు - 50 వేలు
* సీఎన్జీ ఫిల్లింగ్‌ కేంద్రాలు - 50
* ప్రతిరోజూ డిమాండ్‌ - 3,000 కేజీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని