logo

కంటోన్మెంట్‌లో పర్యటించిన రక్షణ శాఖ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌

రక్షణ శాఖ పుణే సదరన్‌ కమాండ్‌, ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ కేజేఎస్‌ చౌహాన్‌ శుక్రవారం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని సందర్శించారు.

Published : 25 Mar 2023 02:23 IST

జింఖానా మైదానాన్ని పరిశీలిస్తున్న రక్షణ శాఖ సదరన్‌ కమాండ్‌ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ కేజేఎస్‌ చౌహాన్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: రక్షణ శాఖ పుణే సదరన్‌ కమాండ్‌, ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ కేజేఎస్‌ చౌహాన్‌ శుక్రవారం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంటోన్మెంట్‌ బోర్డుకు సమకూరుతున్న ఆదాయం, ఆదాయ వనరులు తదితర అంశాలను పరిశీలించారు. జింఖానా, బైసన్‌ పోలో మైదానాలు, పికెట్‌ కంటోన్మెంట్‌ గార్డెన్స్‌, కంటోన్మెంట్‌ ట్రెంచింగ్‌ గ్రౌండ్‌, మడ్‌ఫోర్ట్‌ హాకీ మైదానంలతోపాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ను పరిశీలించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ నెలకొన్న పరిస్థితులను తెలుసుకోవడానికే పీడీ ఈ ప్రాంతాన్ని సందర్శించారని సీఈవో మధుకర్‌ నాయక్‌ తెలిపారు. ఇక్కడి వివిధ మైదానాలు, ఖాళీ స్థలాల్లో  ఏవైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చా? అనే అంశాలను పరిశీలించేందుకే జింఖానా, బైసన్‌పోలో తదితర మైదానాలు, ఖాళీ స్థలాలను సందర్శించారన్నారు. కొద్దిరోజులక్రితం వరకు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే విషయమై వేగంగా పావులు కదిపిన కేంద్రం ఒక్కసారిగా ఆ అంశాన్ని పెండింగ్‌లో పెట్టడం, ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించి, రద్దు చేసిన నేపథ్యంలో పీడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది. మరోవైపు ఆయన పర్యటనపై స్థానికంగా భిన్నవాదనలు వినిపిస్తుండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని