logo

రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శం

 తెలంగాణలో అమలవుతున్న శాంతిభద్రతల వ్యవస్థ యావత్‌ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు.

Published : 25 Mar 2023 02:23 IST

బాచుపల్లి ఠాణా భవనాన్ని ప్రారంభిస్తున్న హోం మంత్రి మహమూద్‌ అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి

నిజాంపేట, న్యూస్‌టుడే:  తెలంగాణలో అమలవుతున్న శాంతిభద్రతల వ్యవస్థ యావత్‌ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. బాచుపల్లిలో కామన్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ(సీఎస్‌ఆర్‌) పథకం కింద రూ.3.5 కోట్లతో అరబిందో ఫార్మా ఆధ్వర్యంలో నిర్మించిన నూతన ఠాణా భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.700 కోట్లతో చేపట్టిన సంస్కరణలు పోలీసు రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాయన్నారు. ఆధునిక సదుపాయాలతో బాచుపల్లిలో నిర్మించిన ఠాణా ఐదు నక్షత్రాల హోటల్‌ను తలపించేలా ఉందన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, కె.నవీన్‌కుమార్‌, వాణీదేవి, సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, నిజాంపేట మేయర్‌ కొలను నీలారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ధన్‌రాజ్‌యాదవ్‌, ఏసీపీ ఎ.చంద్రశేఖర్‌, బాచుపల్లి సీఐ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు