logo

ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించాలి

ఎంఎంటీఎస్‌ను ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు పొడిగించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు.

Published : 25 Mar 2023 02:24 IST

రైల్వే శాఖ మంత్రికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతి

ఈనాడు, దిల్లీ: ఎంఎంటీఎస్‌ను ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు పొడిగించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. యదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని ఆయన తెలిపారు. ఎంఎంటీఎస్‌ పొడిగింపు పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయం భరించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించేందుకు చొరవ చూపడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వమే పూర్తి వ్యయం భరించి ఎంఎంటీఎస్‌ పొడిగింపునకు కృషి చేయాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని