logo

ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Updated : 25 Mar 2023 04:05 IST

ఆర్‌.కృష్ణయ్యతో కలిసి దీక్షలో బీసీ సంఘాల నేతలు తార, వేముల రామకృష్ణ,
గుజ్జ సత్యం, నీల వెంకటేష్‌, గుజ్జ కృష్ణ, జిల్లపల్లి అంజి, వెంకటేష్‌గౌడ్‌ తదితరులు

నల్లకుంట, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ అసమర్థత వల్లే లీకేజీ జరిగిందని ఆరోపిస్తూ శుక్రవారం విద్యానగర్‌ బీసీ భవన్‌లో బీసీ సంఘాల నేతలతో కలిసి ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమాల ఫలితంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తే, ప్రభుత్వంలోని కొందరు పెద్దల అవినీతితో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. తర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్‌, ఫెడరేషన్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ నీల వెంకటేష్‌, బీసీ సంఘాల నేతలు వేముల రామకృష్ణ, జిల్లపల్లి అంజి, గుజ్జ సత్యం, వెంకటేష్‌గౌడ్‌, లాల్‌కృష్ణ, సి.రాజేందర్‌, తార, వాణి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని