logo

విమానాలూ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందాలి

అంతరిక్షంలోకి రాకెట్లు.. ఉపగ్రహాలూ పంపుతున్నాం.. ఈ తరహాలోనే విమానాలు కూడా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందాలని, ఇస్రో, డీఆర్‌డీవోలు ఆ దిశగా పరిశోధనలు సాగించాలని కేంద్ర రక్షణమంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి సూచించారు.

Published : 25 Mar 2023 02:21 IST

జాతీయ సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న డా. సతీష్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్‌
డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌, డీఆర్‌డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: అంతరిక్షంలోకి రాకెట్లు.. ఉపగ్రహాలూ పంపుతున్నాం.. ఈ తరహాలోనే విమానాలు కూడా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందాలని, ఇస్రో, డీఆర్‌డీవోలు ఆ దిశగా పరిశోధనలు సాగించాలని కేంద్ర రక్షణమంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఉస్మానియా వర్సిటీ ఠాగూర్‌ ఆడిటోరియంలో ‘అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో స్వీయ సమృద్ధి విధానం’పై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కృత్రిమమేధ, మిషన్‌ లాంగ్వేజీల సద్వినియోగంతో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు దేశీయ విమానాల తయారీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు.  విదేశీ పరిజ్ఞానంతో తయారైన రేజర్‌ బ్లేడ్‌ తరహాలో మనమూ సంక్లిష్టంగా అనిపించే యంత్రాలు, పరికరాల రూపకల్పనలో అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. ఉపరితలంలో గాలి వేగాన్ని కచ్చితంగా లెక్కగట్టకపోతే పీఎస్‌ఎల్వీ లాంటి రాకెట్లు లక్ష్యాన్ని చేరుకోలేవని, ఉపగ్రహాల ప్రయోగాలకు ముందే వీటన్నింటినీ సరిచూసుకోవాలని ఐఐఎస్‌టీ కులపతి డాక్టర్‌ బి.ఎన్‌.సురేష్‌ సూచించారు. డీఆర్‌డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌, డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌(ఎంఎస్‌ఎస్‌) డాక్టర్‌ బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి, ఇస్రో సంచాలకులు డాక్టర్‌ వి.నారాయణన్‌, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.లక్ష్మినారాయణ, యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ సిస్టమ్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ చాప్టర్‌ ప్రతినిధులు డాక్టర్‌ సతీష్‌రెడ్డికి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని