logo

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాలు ప్రకారం.. రాధాకృష్ణ హౌజింగ్‌కాలనీలో ఉంటున్న యువతి(28) ఓప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది.

Published : 25 Mar 2023 02:07 IST

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాలు ప్రకారం.. రాధాకృష్ణ హౌజింగ్‌కాలనీలో ఉంటున్న యువతి(28) ఓప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. ఇంటర్వ్యూ ఉందని.. దానికి సన్నద్ధమవుతున్నాను, ఎవరూ పిలవొద్దని కుటుంబ సభ్యులకు చెప్పి గురువారం రాత్రి ఏడు గంటలకు ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొన్ని గంటలు గడిచినా తలుపులు తీయకపోగా.. ఎంత పిలిచినా పలకలేదు. దాంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని