logo

భార్య మృతికి కారకుడైన భర్తకు ఏడేళ్ల జైలు

పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన వ్యక్తికి జిల్లా కోర్టు శుక్రవారం ఏడేళ్లు జైలుశిక్ష విధించింది.

Published : 25 Mar 2023 02:06 IST

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన వ్యక్తికి జిల్లా కోర్టు శుక్రవారం ఏడేళ్లు జైలుశిక్ష విధించింది. విశాఖపట్నం జిల్లా బుచ్చిరాజుపాలెం గాంధీనగర్‌వాసి వల్లపుజగన్నాథం రైల్వే ఉద్యోగి. అతని కుమార్తె జయలక్ష్మి అలియాస్‌ నిత్యను స్థానిక ఎన్‌ఏడీ కొత్తరోడ్డుకు చెందిన వేడువాక సురేష్‌కు ఇచ్చి 2011లో పెళ్లిచేశారు.వారు నగరంలోని ఉప్పల్‌ స్వరూప్‌నగర్‌కు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఏడాది తరువాత బాబు పుట్టాడు. అనంతరం సురేష్‌ అదనపుకట్నం కావాలని భార్యను తరచూ వేధించేవాడు. దాంతో ఆమె మనస్తాపం చెంది 2014 జులై 13న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదుచేసిన పోలీసులు సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేరేడ్‌మెట్‌లోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కోర్టు 1వ అదనపు జిల్లా సెషన్‌జడ్జి, మెట్రోపాలిటన్‌ సెషన్‌ జడ్జి రఘునాథరెడ్డి కేసు విచారించి సురేష్‌కు జైలుశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని