logo

‘ప్రాథమిక దశలో గుర్తిస్తే క్షయను నియంత్రించొచ్చు’

ప్రాథమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందిస్తే క్షయవ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి వైద్య నిపుణులు, పల్మనాలజిస్ట్‌ ప్రొ.టి.ప్రమోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 25 Mar 2023 02:21 IST

సుల్తాన్‌బజార్‌లో ర్యాలీలో ఎన్‌సీసీ విద్యార్థులు

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ప్రాథమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందిస్తే క్షయవ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి వైద్య నిపుణులు, పల్మనాలజిస్ట్‌ ప్రొ.టి.ప్రమోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం సుల్తాన్‌బజార్‌లోని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ, పీజీ కళాశాలలో క్షయవ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది. 25 సంవత్సరాలుగా క్షయవ్యాధి నివారణకు కృషి చేస్తున్న ప్రొ.టి.ప్రమోద్‌కుమార్‌ను సత్కరించారు. ఐఎంఏ అధ్యక్షుడు డా.టి.దయాళ్‌సింగ్‌, తెలంగాణ మేధావుల ఫోరం ఛైర్మన్‌ డా.రాజ్‌నారాయణ్‌ ముదిరాజ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ డా.మాధవీలత, ఎన్‌సీసీ అధికారి డా.టి.పి.సింగ్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైద్రాబాద్‌ సౌత్‌ డైరక్టర్‌ ప్రేమ్‌చంద్‌ మౌనత్‌జైన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని