logo

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఊబకాయులు

దేశంలో రెండేళ్లుగా ఊబకాయుల సంఖ్య పెరుగుతోందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఊబకాయం.. ఎదురయ్యే సమస్యలపై శుక్రవారం ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Published : 25 Mar 2023 02:21 IST

అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వారితో  డా.కోన లక్ష్మీకుమారి

సోమాజిగూడ, న్యూస్‌టుడే: దేశంలో రెండేళ్లుగా ఊబకాయుల సంఖ్య పెరుగుతోందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఊబకాయం.. ఎదురయ్యే సమస్యలపై శుక్రవారం ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి గ్రూప్‌ డైరెక్టర్‌ డా.పవన్‌ గోరుకంటి మాట్లాడుతూ.. ఊబకాయం మనిషి జీవితాన్ని భారంగా మారుస్తున్న జబ్బు అని, కొవిడ్‌తో ఇళ్లకే పరిమితమవడంతో చాలా మందిలో ఈ సమస్య పెరిగిందన్నారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతోందని వివరించారు. సీనియర్‌ సర్జికల్‌ గ్యాస్టో ఎంట్రారాలజిస్ట్‌, బేరియాట్రిక్‌ సర్జన్‌ డా.కోన లక్ష్మి కుమారి మాట్లాడుతూ.. ఇటీవల అధికులు ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య స్థూలకాయమని పేర్కొన్నారు.  ప్రతి ఒక్కరు రోజువారీ వ్యాయామం, సమతుల ఆహారం పాటించాలని, అయినా బరువు పెరిగితే బేరియాట్రిక్‌ సర్జరీ అవసరమని తెలిపారు. దీనితో బరువు తగ్గడమే కాకుండా అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని