logo

అప్రజాస్వామిక విధానాలపై కలిసి పోరాడదాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై కలిసికట్టుగా పోరాడుదామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

Published : 25 Mar 2023 02:21 IST

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు 

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై కలిసికట్టుగా పోరాడుదామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీభవన్‌లో ‘ఎలెక్టెడ్‌ డిక్టేటర్‌షిప్‌ సర్వైవింగ్‌- సామాన్య ప్రజల కోసం పోరాటం’ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. మాజీ ఎంపీలు బలరాంనాయక్‌, పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నాయకులు చెరుకు సుధాకర్‌, కత్తి వెంకటస్వామి, అజ్మతుల్లా హుస్సేన్‌, పవన్‌ మల్లాది, చరణ్‌ కౌశిక్‌, కోట నీలిమ, ప్రొ.గాలి వినోద్‌కుమార్‌, సివిల్‌ లిబర్టీస్‌ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాస్కీ మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాల నియంతృత్వ, అప్రజాస్వామిక ధోరణులను నిలదీస్తూ సామాన్యుల తరఫున ఎప్పటికప్పుడు గొంతెత్తుతున్న కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాస్వామికవాదులపై తప్పుడు కేసులు పెట్టి, జైలు పాలు చేసి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన పలు సంఘటనలపై చర్చించారు. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ ధోరణిపై అందరం కలిసికట్టుగా పోరాడుదామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు