logo

జాతీయ రహదారిపై వెలిగిన వీధి దీపాలు

పరిగి పట్టణం మీదుగా వెళ్లిన జాతీయ రహదారిపై వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో ప్రజలు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 25 Mar 2023 02:21 IST

పరిగి, న్యూస్‌టుడే: పరిగి పట్టణం మీదుగా వెళ్లిన జాతీయ రహదారిపై వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో ప్రజలు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ‘వెలుగులు పంచవు.. వెతలు తీరవు’ అనే శీర్షికతో ఈనెల 14న ఈనాడులో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. పురపాలక సంఘం అధికారులు నేషనల్‌ హైవే, ట్రాన్సుకో అధికారులతో మాట్లాడారు. చివరకు గురువారం రాత్రి సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. దీపాలు వెలగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు