logo

సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి

గుండెనొప్పి కారణంగా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భారాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు.

Published : 25 Mar 2023 02:21 IST

పారిశుద్ధ్య కిట్టు, సామగ్రిని పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌, కమిషనర్‌ శరత్‌చంద్ర తదితరులు

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: గుండెనొప్పి కారణంగా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భారాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ వేడుక వేదికలో వికారాబాద్‌ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎవరికైనా గుండెనొప్పి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన సీపీఆర్‌ జాగ్రత్తలపై పారిశుద్ధ్య సిబ్బంది, బిల్‌ కలెక్టర్ల్లు, వాటర్‌మెన్‌, ఆర్‌పీలకు, మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు అత్యవసరవేళ వెంటనే సాయపడతారన్నారు. గతంలో ఒక వ్యక్తి రోడ్డుపక్కనే పడిపోతే సీపీఆర్‌ చేయడం ద్వారా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని గుర్తు చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్‌ కిట్లు, దుస్తులు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర, ఛైర్‌పర్సన్‌ మంజుల, వైస్‌ఛైర్మన్‌ శంషాద్‌బేగం, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, డాక్టర్లు, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని