TSPSC Paper Leak Case : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న సిట్‌..

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 25 Mar 2023 09:58 IST

హైదరాబాద్‌ :  టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ ఉపాధి హామీ విభాగంలో పని చేసే ఉద్యోగి ప్రశాంత్‌ను సిట్‌ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.పేపర్ కొనుగోలు చేసి అతడు పరీక్ష రాసినట్లు గుర్తించారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డికి బావ అయిన ప్రశాంత్‌.. గ్రూప్ వన్ పరీక్ష రాసి 100కు పైగా మార్కులు తెచ్చుకున్నట్లు సిట్‌ ఆధారాలు సేకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని