Heera gold scam: హీరా గోల్డ్‌ కుంభకోణం.. రూ.33.06 కోట్ల ఆస్తుల అటాచ్‌

హీరాగోల్డ్‌ కుంభకోణం కేసులో మరో రూ.33.06 విలువైన చరాస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. నౌహీరా షేక్‌, హీరాగోల్డ్‌  సంస్థలకు చెందిన 24 చరాస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది.

Updated : 25 Mar 2023 16:35 IST

హైదరాబాద్‌: హీరా గోల్డ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్‌ సంస్థల ఎండీ నౌహీరా షేక్‌కు చెందిన మరో రూ.33.06  కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. వ్యక్తిగత, సంస్థకు చెందిన 24 చరాస్తులను అటాచ్‌ చేసింది. గతంలో సుమారు రూ.367కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. హీరా గోల్డ్‌ రూ. 5వేల కోట్ల కుంభకోణంపై మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. నౌహీరా షేక్ మీద మొత్తం పది కేసులున్నాయి. హీరా గోల్డ్ కుంభకోణం వల్ల దాదాపు 1.72 లక్షల మంది ఇన్వెస్టర్లు మోసపోయినట్లు అంచనా. మనీలాండరింగ్‌ కేసులో 2018 అక్టోబర్ 16వ తేదీన నౌహీరా షేక్‌ను అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని