logo

27 నుంచి ‘డబుల్‌’ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ

తాండూరు పట్టణంలో పేదలకు సొంతింటి కల నెరవేరబోతోంది. తాండూరు - హైదరాబాద్‌ రహదారి మార్గంలో నిర్మించిన 581 రెండు పడక గదుల ఇళ్ల మంజూరుకు దరఖాస్తుల్ని ఈనెల 27 నుంచి స్వీకరింస్తారని తాండూరు తహసీల్దారు చిన్నప్పలనాయుడు తెలిపారు.

Published : 26 Mar 2023 00:44 IST

నిర్మాణం పూర్తయిన ఇళ్లు

తాండూరు గ్రామీణ, తాండూరు పట్టణం, న్యూస్‌టుడే:తాండూరు పట్టణంలో పేదలకు సొంతింటి కల నెరవేరబోతోంది. తాండూరు - హైదరాబాద్‌ రహదారి మార్గంలో నిర్మించిన 581 రెండు పడక గదుల ఇళ్ల మంజూరుకు దరఖాస్తుల్ని ఈనెల 27 నుంచి స్వీకరింస్తారని తాండూరు తహసీల్దారు చిన్నప్పలనాయుడు తెలిపారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఇందుకోసం పట్టణంలో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1 నుంచి 6 వార్డులకు సంబంధించిన దరఖాస్తులను ఇందిరానగర్‌లోని బస్తీ దవాఖాన (యూపీహెచ్‌సీ) భవనంలో స్వీకరిస్తారు. 7 నుంచి 12 వార్డుల దరఖాస్తుల్ని మున్సిపల్‌ కార్యాలయంలో, 13 నుంచి 18 వార్డులవి పాతతాండూరు అంబేడ్కర్‌ భవనంలో, 22 నుంచి 27 వార్డులవి రైతుబజార్‌లో, 19 నుంచి 36 వార్డులవి పాతమున్సిపల్‌ కార్యాలయంలో స్వీకరిస్తామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంటారు. దరఖాస్తు పత్రాలను మీసేవా, జిరాక్సు కేంద్రాల్లో అందుబాట్లో ఉంచామన్నారు. దరఖాస్తులతోపాటు ఆధార్‌, ఆహార భద్రత, ఓటరు గుర్తింపు కార్డులను, ఫోటోను జత చేయాలని సూచించారు. పట్టణానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని ఉంటుందన్నారు. పత్రాలను మీ సేవా కేంద్రాలలో తీసుకోవాలన్నారు. అభ్యర్థులు పట్టణ నివాసులై ఉండాలని, పట్టణానికి  సంబంధించిన రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌ పోర్టు సైజు ఫోటో తప్పని సరిగా ధరఖాస్తులకు జత చేయాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని