logo

దేశ భవిష్యత్తుకు యువతే కీలకం : డీఆర్‌ఓ

దేశ భవిష్యత్తు నేటి యువతపైనే ఆధారపడి ఉందని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) అశోక్‌కుమార్‌ అన్నారు.

Published : 26 Mar 2023 00:44 IST

కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న అశోక్‌కుమార్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: దేశ భవిష్యత్తు నేటి యువతపైనే ఆధారపడి ఉందని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) అశోక్‌కుమార్‌ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లా నెహ్రూ యువక కేంద్రం, యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పొరుగు యువత పార్లమెంట్‌ (నైబర్‌హుడ్‌ పార్లమెంట్‌) కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రసంగించారు. భారత ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు. జీ20, వై20లో భాగమై ఈ దేశాన్ని ఉన్నతంగా మార్చటానికి బాటలు వేయాలన్నారు. సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సేవా నాయక్‌ మాట్లాడుతూ చిరుధాన్యాల సాగు పద్ధతులు, ఆరోగ్య ప్రయోజనాలు, ఆహార ఉత్పత్తుల గురించి వివరించారు. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరమని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస పోటీలను నిర్వహించి విజేతలకు ధ్రువ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దశరథ్‌, వ్యవసాయ శాఖ ఏడీ స్వరూప రాణి, నెహ్రూ యువక కేంద్రం అధికారి టి. ఐషయ్య, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని