ఇద్దరు పిల్లలతో కలిసి దంపతుల బలవన్మరణం
ఆ దంపతులకు పిల్లలే ప్రాణం. వాళ్లే ప్రపంచం. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు అనారోగ్యంతో బాధ పడడాన్ని వారు తట్టుకోలేక పోయారు.
కుమారుల అనారోగ్యంపై మనస్తాపంతోనే..
దంపతులు సతీశ్, వేద, పిల్లలు నిషికేత్, నిహాల్
ఈనాడు-హైదరాబాద్, కాప్రా-న్యూస్‌టుడే: ఆ దంపతులకు పిల్లలే ప్రాణం. వాళ్లే ప్రపంచం. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు అనారోగ్యంతో బాధ పడడాన్ని వారు తట్టుకోలేక పోయారు. వైద్యం అందిం చినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వేదనకు గురయ్యారు. బిడ్డలకు విషమిచ్చి.. తామూ తీసుకున్నారు. కుషాయిగూడలోని కందిగూడలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన గాదె సతీశ్(39)కు, సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన వేద(35)తో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు నిషికేత్(9), నిహాల్(5) ఉన్నారు. నిషికేత్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు లేవు. నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సతీశ్.. రెండేళ్లుగా కుటుంబంతో కందిగూడలో ఉంటున్నారు. నిహాల్ పుట్టుకతోనే ఆటిజంతో బాధపడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం నిషికేత్ కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు మెనింజైటిస్ ఉన్నట్లు చెప్పారు. అతనికి వినికిడి లోపం ఏర్పడింది. దంపతులిద్దరూ పిల్లల ఆరోగ్యం గురించి బాధపడేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
సైనైడ్ తీసుకుని..: శనివారం మధ్యాహ్నం పిల్లలకు, భార్యకు సతీశ్ సైనైడ్ ఇచ్చాడని.. ముగ్గురూ చనిపోయారని ధ్రువీకరించుకున్నాక తానూ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత సతీశ్, వేదలకు తెలిసిన వ్యక్తులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. అనుమానంతో ఇంటికొచ్చి చూడగా.. ఇద్దరు పిల్లలు, వేద పడక గదిలో విగతజీవులుగా పడిఉన్నారు. సతీశ్ పక్క గదిలో కుప్పకూలిపోయి కనిపించాడు.
‘ప్రశాంతంగా చనిపోనివ్వండి’..: ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ‘మా నలుగుర్ని కాపాడాలని ప్రయత్నించొద్దు. ప్రశాంతంగా చనిపోనివ్వండి’’ అని అందులో రాసినట్లు తెలిసింది. పిల్లల అనారోగ్యంపైనే మనస్తాపానికి గురయ్యేవారని వేద తండ్రి శ్రీశైలం కంటతడి పెట్టారు. వారికి సైనైడ్ ఎలా లభించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, మల్కాజిగిరి డీసీపీ జానకి, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?