logo

భారాస ఆత్మీయ సమ్మేళనాల సందడి

రాజధానిలోని మూడు జిల్లాల పరిధిలో భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమయ్యాయి. 

Published : 26 Mar 2023 02:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలోని మూడు జిల్లాల పరిధిలో భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమయ్యాయి.  ఏప్రిల్‌ 20 వరకు గ్రేటర్‌లో పెద్ద ఎత్తున సమ్మేళనాలు జరగనున్నాయి. కార్యకర్తల అసంతృప్తులు, నేతల బుజ్జగింపుల మధ్య సమావేశాలు ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరి జరుగుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లోని డివిజన్ల వారీగా సమావేశాలు ప్రారంభం కాగా.. శనివారం బేగంపేట డివిజన్‌లో ఆత్మీయ సమావేశం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, భారాస హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి దాసోజు శ్రవణ్‌ పాల్గొన్నారు. గండిపేట మండలంలో జరిగిన సమ్మేళనంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎంపీ రంజిత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మేడ్చల్‌ నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం నియోజవర్గం పరిధిలోని పెద్ద అంబర్‌పేటలో భారాస నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన ప్రగతి నివేదన యాత్ర సభలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు