logo

అగ్నిప్రమాదం పొంచి ఉన్న 23 భవనాలకు శ్రీముఖాలు

వరుస అగ్ని ప్రమాదాలతో జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. ముమ్మర తనిఖీలతో  ముప్పు ఉన్న భవనాలను గుర్తిస్తూ.. వాటికి నోటీసులు జారీ చేస్తూ.. గడువులోపు చక్కదిద్దుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Published : 26 Mar 2023 02:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: వరుస అగ్ని ప్రమాదాలతో జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. ముమ్మర తనిఖీలతో  ముప్పు ఉన్న భవనాలను గుర్తిస్తూ.. వాటికి నోటీసులు జారీ చేస్తూ.. గడువులోపు చక్కదిద్దుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. స్పందించకపోతే ప్రాంగణాన్ని మూసేస్తామని, తలుపులకు తాళం వేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా రద్దీ ప్రాంతాల్లోని 23 వాణిజ్య భవనాలకు మొదటి నోటీసులు ఇచ్చినట్లు బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ఆయా భవనాలకు మూడ్రోజుల గడువు ఇచ్చామని, స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. రద్దీ ప్రాంతాల్లో నిత్యం వందలాది మంది వినియోగదారులను ఆకర్షించే వ్యాపార సముదాయాలను ఎంపిక చేసుకుని, వాటిలో అగ్నిమాపక వ్యవస్థ ఏమేర పని చేస్తోంది, అసలు ఉందా, లేదా అనే అంశాలను పరిశీలిస్తున్నామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. నిర్లక్ష్యం కనిపిస్తే అక్కడికక్కడే మొదటి నోటీసు ఇస్తున్నామని, దానికి మూడ్రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే వ్యాపార సముదాయాన్ని సీజ్‌ చేస్తామని అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని