logo

కోలాంగియోస్కోపీ, ఈఆర్‌సీపీలపై ఏఐజీలో సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం

నగరంలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూ్ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో కోలాంగియో స్కోపీ, ఎండోస్కోపిక్‌ రెట్రోగ్రేడ్‌ కోలాంగియో- ప్యాంక్రియాటోగ్రఫీ (ఈఆర్‌సీపీ)లకు సంబంధించి సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.

Published : 26 Mar 2023 02:04 IST

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, మైక్‌జోన్స్‌, జి.వి.రావు తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూ్ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో కోలాంగియో స్కోపీ, ఎండోస్కోపిక్‌ రెట్రోగ్రేడ్‌ కోలాంగియో- ప్యాంక్రియాటోగ్రఫీ (ఈఆర్‌సీపీ)లకు సంబంధించి సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. వైద్య పరికరాల కంపెనీ బోస్టన్‌ సైంటిఫిక్‌ కార్పొరేషన్‌, ఏఐజీ కలిసి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి, బోస్టన్‌ సైంటిఫిక్‌ ఎండోస్కోపీ సీనియర్‌ ప్రెసిడెంట్‌ మైక్‌జోన్స్‌, ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోజ్‌ మాధవన్‌ కలిసి శనివారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏఐజీ ముందుంటుందని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా దేశంతోపాటు దక్షిణాసియా దేశాల వైద్యులకు శిక్షణ, నైపుణ్యాలను పెంచడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. జీర్ణకోశ సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా జీఐ ఎండోస్కోపీలో నాణ్యమైన శిక్షణ ఇవ్వడంతో ఈ కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. బోస్టన్‌ సీనియర్‌ ప్రెసిడెంట్‌ మైక్‌జోన్స్‌ మాట్లాడుతూ ఏఐజీతో కలిసి వైద్య నిపుణులకు శిక్షణ ఇవ్వడం, వారి నైపుణ్యాలను పెంచడానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని