లారీ ఢీకొని యువ జంట దుర్మరణం
ఐదు నెలల క్రితమే వారికి వివాహం జరిగింది. పుట్టింట జరిగే తల్లిదండ్రుల సంవత్సరికానికి భర్తతో వచ్చి..
పెళ్లయిన ఐదు నెలలకే విషాదం
సుభాష్‌రెడ్డి-రోజారాణి
వైరా, న్యూస్‌టుడే: ఐదు నెలల క్రితమే వారికి వివాహం జరిగింది. పుట్టింట జరిగే తల్లిదండ్రుల సంవత్సరికానికి భర్తతో వచ్చి.. తిరిగి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ మృత్యుశకమై వచ్చి వారిద్దరినీ కబళించింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా వైరాలో శనివారం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌కు చెందిన రంగా సుభాశ్‌రెడ్డి(38)తో సత్తుపల్లికి చెందిన వనం రోజారాణి(34)కి గత నవంబరు 5న వివాహం జరిగింది. రోజారాణి ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు చేయగా, సుభాష్‌రెడ్డి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. రోజారాణి తల్లిదండ్రుల సంవత్సరీకం ఈ నెల 20న సత్తుపల్లిలో జరగ్గా, దంపతులు హాజరయ్యారు. అనంతరం వారం తరువాత శనివారం స్కూటీపై హైదరాబాద్ ప్రయాణమయ్యారు. తల్లాడ నుంచి వైరా వస్తున్న లారీ స్థానిక క్రాస్‌రోడ్డులో మధిర వైపు తిరుగుతున్న క్రమంలో పక్కనే వెళ్తున్న దంపతుల ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దంపతులిద్దరూ కిందపడగా లారీ వెనుకచక్రాలు వారిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో దంపతుల వాహనంపై పెంపుడు శునకం ఉండగా, దానికి ఎలాంటి గాయాలు కాలేదు. ఏసీపీ రహమాన్, సీఐ సురేశ్, ఎస్సై వీరప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వద్దని చెప్పినా వినలేదు..: ఈ నెల 18న హైదరాబాద్ నుంచి దంపతులు సత్తుపల్లికి వచ్చారు. ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి వస్తుండగా అలా రావొద్దని చెప్పినా ఇద్దరు వినలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తిరుగు ప్రయాణంలోనూ ద్విచక్రవాహనంపై అంతదూరం వెళ్లొద్దని చెప్పినా జాగ్రత్తగా వెళ్తామంటూ చెప్పినట్లు తెలిపారు. పెళ్లయిన ఐదు నెలలకే మృత్యువాత పడటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi: రూ.1400కోట్ల వ్యయంతో.. దిల్లీలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ!
-
Movies News
Srikanth Odhela: వైభవంగా ‘దసరా’ దర్శకుడి వివాహం.. నాని పోస్ట్‌తో శుభాకాంక్షల వెల్లువ
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/06/2023)
-
Movies News
Bellamkonda Ganesh: అప్పుడు రిలీజ్ డేట్ సరిగ్గా ప్లాన్ చేయలేదనే టాక్ వినిపించింది: బెల్లంకొండ గణేశ్
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
Movies News
The Night Manager: ‘ది నైట్ మేనేజర్’.. పార్ట్ 2 వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?