logo

ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ‘భారత్‌ భోజనం’

ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో స్పెషల్‌ ఫౌండేషన్‌ కోర్సుకు హాజరైన 112 మంది ట్రైనీ సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్లు ‘భారత్‌ భోజనం’ పేరుతో శనివారం వేడుక నిర్వహించారు.

Published : 26 Mar 2023 02:04 IST

ట్రైనీ అధికారులతో మహేష్‌ దత్‌ ఎక్కా

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో స్పెషల్‌ ఫౌండేషన్‌ కోర్సుకు హాజరైన 112 మంది ట్రైనీ సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్లు ‘భారత్‌ భోజనం’ పేరుతో శనివారం వేడుక నిర్వహించారు. తమ రాష్ట్రాలలో ప్రత్యేకమైన వంటకాలను వండి వార్చారు. సామాజిక సేవ చేస్తున్న సంస్థలను ఆదుకునేందుకు ఆయా వంటకాలను విక్రయించారు. సంప్రదాయ దుస్తులు, ఆభరణాలను ధరించి ప్రాంగణాన్ని మినీ-ఇండియాగా మార్చారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌ బెన్‌హూర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా బెలూన్లు వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోర్సు డైరెక్టర్‌ డా.మాధవి రావులపాటి, విశ్రాంత ఐఎఫ్‌ఎస్‌ తిరుపతయ్య, అధికారులు శ్రీదేవి అయలూరి, విశ్రాంత ఐఏఎస్‌ అనితా రాజేంద్ర పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని