logo

Cheetah: జూలో గుండెపోటుతో కన్నుమూసిన చీతా

నెహ్రూ జూపార్కులో చీతా శనివారం గుండెపోటుతో కన్నుమూసింది. పదకొండేళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటున్న మగ చీతా అబ్దుల్లా(15) మృత్యువాతపడటంతో అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు.

Updated : 26 Mar 2023 08:59 IST

చార్మినార్‌: నెహ్రూ జూపార్కులో చీతా శనివారం గుండెపోటుతో కన్నుమూసింది. పదకొండేళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటున్న మగ చీతా అబ్దుల్లా(15) మృత్యువాతపడటంతో అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు. ప్రస్తుతం దక్షిణ భారతంలో మైసూర్‌తోపాటు నెహ్రూ జూలోనే చీతాలు ఉన్నాయి. 2011లో సౌదీ రాజ కుటుంబీకులు జూను సందర్శించి, జూ నిర్వహణకు ముగ్ధులై 2012లో ఒక జత ఆడ, మగ చీతాలను జూకు పంపించారు. అప్పుడు వీటి వయసు నాలుగేళ్లు. ఆడ చీతా పన్నెండేళ్ల ప్రాయంలో (2020లో) అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి జూలో అబ్దుల్లా ఒంటరిగా ఉంటోంది.  అబ్దుల్లా మరణంతో ప్రస్తుతం జూలో చీతాలు లేకుండా పోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని