గుండెపోటు కాదు.. హత్య
డబ్బు వ్యవహారంలో స్నేహితుడిని కొట్టి ఇంటి వెనుక పడేశారు. పక్కన ఉండే వ్యక్తి ఆసుపత్రికి తీసుకువెళ్లగా గుండెపోటుగా వైద్యులు తెలిపారు.
శవపంచనామాలో నిర్ధారణ
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డబ్బు వ్యవహారంలో స్నేహితుడిని కొట్టి ఇంటి వెనుక పడేశారు. పక్కన ఉండే వ్యక్తి ఆసుపత్రికి తీసుకువెళ్లగా గుండెపోటుగా వైద్యులు తెలిపారు. శవ పరీక్షలో హత్యగా తేలింది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్‌లో నివసించే మొగులమ్మ ఈ నెల 22న తన చిన్న కుమారుడు మోహన్‌తో కలిసి స్వగ్రామమైన జహీరాబాద్‌కు వెళ్లారు. 23న రాత్రి 9:30 సమయంలో ఇంటి పక్కన నివసించే రాజు అనే వ్యక్తి ఫోన్‌చేసి, ఆమె పెద్ద కుమారుడు బి.జైపాల్(37) ఇంటివెనుక అపస్మారక స్థితిలో ఉండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లామని, అప్పటికే మృతి చెందాడని, గుండెపోటని వైద్యులు చెప్పినట్లు వివరించాడు. మొగులమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, శవ పంచనామా చేయించారు. తలకు గాయాలై మృతి చెంది ఉండొచ్చని వైద్యులు నివేదిక ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. జైపాల్ తన స్నేహితుడు నితిన్ అలియాస్ ఆది(34)కు ఇవ్వాల్సిన రూ.5వేల విషయంలో జరిగిన గొడవలో మృతి చెందినట్లు గుర్తించారు. నితిన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, గొడవలో గాయపడి మృతి చెందినట్లు అంగీకరించాడు. ఘటన జరిగిన సమయంలో తనతోపాటు మల్లేష్ ఉన్నట్లు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు