నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం: ఏబీవీపీ
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి వెళ్తున్న ఏబీవీపీ విద్యార్థులు
ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. లీకేజీలపై నైతిక బాధ్యత వహిస్తూ టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సెక్రటరీ, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆర్ట్స్ కళాశాల నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి ర్యాలీ నిర్వహించారు. ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. గేటుపైకి ఎక్కేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కమల్ సురేష్, జీవన్, పృథ్వీ, రాజు, రాజేష్, హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఆర్ట్స్ కళాశాల వద్ద ఆందోళనలో టీఎస్ జేఏసీ, ఓయూ జేఏసీ నాయకులు
లీకేజీపై సీఎం స్పందించాలి: టీఎస్ జేఏసీ
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించాలని టీఎస్ జేఏసీ ఛైర్మన్ భట్టు శ్రీహరి నాయక్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్ జేఏసీ, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూలో శనివారం ఆందోళన చేపట్టారు. లైబ్రరీ నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ శ్రీహరినాయక్ మాట్లాడుతూ.. లీకేజీతో రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను చీకట్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు నవీన్‌యాదవ్, ప్రవీణ్, రాజేష్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు