logo

క్రీడాకారుల ఆలోచన విధానంలో మార్పు రావాలి: పీటీ ఉష

క్రీడాకారుల ఆలోచన విధానంలో మార్పు రావాలని పరుగుల రాణి, భారత్‌ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పి.టి.ఉష పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 02:04 IST

జెర్సీ ఆవిష్కరణలో ఉష

గచ్చిబౌలి: క్రీడాకారుల ఆలోచన విధానంలో మార్పు రావాలని పరుగుల రాణి, భారత్‌ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పి.టి.ఉష పేర్కొన్నారు. లిటిల్‌ మిలీనియం ప్లే స్కూల్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియం వద్ద ‘‘లిటిల్‌ మిలీనియం కిడ్స్‌ మారథాన్‌’’ పేరిట పరుగును చేపట్టనున్నారు. చిన్న పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ పరుగుకు సంబంధించిన జెర్సీని శనివారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. లిటిల్‌ మిలీనియం ఎడ్యుకేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఉపాధ్యక్షులు ఆర్‌.ఆనంద్‌ మాట్లాడుతూ చిన్నారులపై వేధింపులను నిరోధించాలనే లక్ష్యంతో ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఏటా మారథాన్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం ఉ.6.30 గంటలకు పరుగును పి.టి.ఉష ప్రారంభిస్తారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని