D Srinivas: సొంతగూటికి డీఎస్‌.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్‌ నేత

మాజీ మంత్రి, సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) సొంతగూటికి చేరారు. గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో డీఎస్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు.

Updated : 26 Mar 2023 13:46 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి, సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) సొంతగూటికి చేరారు. గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో డీఎస్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. డీఎస్‌తో పాటు ఆయన తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎస్‌ గతంలో కాంగ్రెస్‌లో కీలక పదవులు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో పార్టీ 2004, 2009లో అధికారంలో ఉన్నప్పుడు డీఎస్‌ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసలో చేరిన డీఎస్‌.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని