logo

పైలెట్‌నని నమ్మించి.. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

పైలెట్‌నని నమ్మించి ఫ్లైట్‌ అటెండెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళను మోసం చేసిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది.

Published : 27 Mar 2023 00:37 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పైలెట్‌నని నమ్మించి ఫ్లైట్‌ అటెండెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళను మోసం చేసిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌కాలనీలో నివసించే సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి భార్య భారతి ఉద్యోగం కోసం చూస్తుండగా, ప్రవీణ్‌కుమార్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను పైలెట్‌నని, ఫ్లైట్‌ అటెండెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలోనే తనకు తక్కువ ధరకు బంగారం వస్తుందని తులం కేవలం రూ. 35వేలు ఉంటుందని చెప్పాడు. కొంత డబ్బులు ఇస్తే తిరిగి కొద్ది రోజుల్లో ఇస్తానంటూ చెప్పడంతో, ఆమె తన తాళిబొట్టు, ఇతర బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి రూ.2.25లక్షలు ఇచ్చింది. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, ఉద్యోగం చూపించలేదు. అతడిని నిలదీయగా బెదిరింపులకు దిగడంతో శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని