logo

పబ్‌లో వ్యాపారిపై దాడి

బంజారాహిల్స్‌లోని పబ్‌కు వెళ్లిన ఓ వ్యాపారిపై కొందరు వ్యక్తులు అకారణంగా దాడికి పాల్పడ్డారు. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 27 Mar 2023 00:37 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బంజారాహిల్స్‌లోని పబ్‌కు వెళ్లిన ఓ వ్యాపారిపై కొందరు వ్యక్తులు అకారణంగా దాడికి పాల్పడ్డారు. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా కేశవ మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన వ్యాపారి హరీశ్‌రెడ్డి శనివారం రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14లోని ఛీర్స్‌ పబ్‌కు వెళ్లారు. రాత్రి 11.35 గంటల ప్రాంతంలో మద్యం తాగుతుండగా, అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చిన వ్యక్తి అకారణంగా గొడవకు దిగి చేయి చేసుకున్నాడు. అనంతరం తన స్నేహితులు పది మందిని పిలవగా, అందరూ కలిసి దాడి చేశారు. దీంతో హరీశ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు చెందిన 30 గ్రాముల బంగారు గొలుసు మాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని