logo

పబ్‌లో అశ్లీల నృత్యాలు.. కేసు నమోదు

సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లోని గోల్డెన్‌ డీర్‌ పబ్‌ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నడుస్తుందనే సమాచారం మేరకు ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, మహంకాళి పోలీసులు దాడులు చేశారు.

Published : 27 Mar 2023 00:37 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లోని గోల్డెన్‌ డీర్‌ పబ్‌ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నడుస్తుందనే సమాచారం మేరకు ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, మహంకాళి పోలీసులు దాడులు చేశారు. కొంతమంది యువతులు, యువకులు అశ్లీలంగా నృత్యాలు చేస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పబ్‌ యజమానులే వినియోగదారులను ఆకర్షించేందుకు ఇలా నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 9 మంది యువతులను అదుపులోకి తీసుకుని వారిని హోంకు తరలించారు. ఇద్దరు బారు యజమానులతోపాటు మరో 9 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు