logo

చిచ్చర పిడుగులు.. విజయానికి పరుగులు

చిన్న పిల్లలపై వేధింపులను అరికట్టాలనే ఉద్దేశంతో లిటిల్‌ మిలీనియం విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కిడ్స్‌ మారథాన్‌ చేపట్టారు.

Published : 27 Mar 2023 01:33 IST

న్యూస్‌టుడే, గచ్చిబౌలి: చిన్న పిల్లలపై వేధింపులను అరికట్టాలనే ఉద్దేశంతో లిటిల్‌ మిలీనియం విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కిడ్స్‌ మారథాన్‌ చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ చిన్నారుల పరుగును భారత్‌ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పి.టి.ఉష జెండా ఊపి  ప్రారంభించారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చిన చిన్నారులు ఉత్సాహంగా పరుగులో పాలుపంచుకున్నారు. మూడు నుంచి పదేళ్ల వయసు పిల్లలు 100 మీటర్ల నుంచి 600 మీటర్ల మారథాన్‌లో పాల్గొని సందడి చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని