logo

ఆరోగ్య భారత నిర్మాణంలో భాగస్వాములవుదాం

ఆరోగ్యవంత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆదివారం హెల్దీ బేబీ షో నిర్వహించారు.

Published : 27 Mar 2023 01:33 IST

తల్లులకు బేబీ కిట్లు అందజేస్తున్న కిషన్‌రెడ్డి, చిత్రంలో శ్యాంసుందర్‌, సరళ, శశిధర్‌రెడ్డి

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఆరోగ్యవంత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆదివారం హెల్దీ బేబీ షో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు సరైన పోషకాహారం అందించడం ద్వారా వారిలో భౌతిక, మానసిక ఎదుగుదల సరిగ్గా ఉంటుందన్నారు. ఆరోగ్యకర అలవాట్లతో పిల్లలను దేశం గర్వించే స్థాయికి చేర్చగలమని చెప్పారు. గర్భిణులు, పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఎదగాలంటే పోషకాహారం ఎంతో అవసరమన్నారు. పోషకాహార లోపంతో రక్తహీనత వంటి సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని చెప్పారు. పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తుందని వివరించారు. హెల్దీబేబీ షోకు తమ పిల్లలతో వచ్చిన తల్లులకు బేబీ కిట్లతోపాటు ధ్రువపత్రాలు అందజేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, కార్పొరేటర్‌ కేతినేని సరళ, భాజపా సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, సనత్‌నగర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ శ్రీశైలంగౌడ్‌, సీనియర్‌ నాయకులు ఇ.దయానంద్‌, జిల్లా కార్యదర్శి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు