logo

శివార్లలో వారాంతం మందు.. విందు..

వారాంతంలో వ్యభిచారం, గంజాయి, హుక్కా, మద్యంతో ఎరవేస్తూ అందినకాడికి నగరం శివారుల్లోని కొన్ని హోటళ్లు, ఫాంహౌస్‌లు, రిసార్టులు దండుకుంటున్నాయి.

Published : 27 Mar 2023 01:33 IST

పోలీసుల అదుపులో నిందితులు

ఈనాడు- హైదరాబాద్‌: వారాంతంలో వ్యభిచారం, గంజాయి, హుక్కా, మద్యంతో ఎరవేస్తూ అందినకాడికి నగరం శివారుల్లోని కొన్ని హోటళ్లు, ఫాంహౌస్‌లు, రిసార్టులు దండుకుంటున్నాయి. తాజాగా సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల దాడులతో ఈ దందా మరోసారి బట్టబయలైంది. కమిషనరేట్‌ పరిధిలోని 8 లాడ్జీలు, 11 ఫాంహౌస్‌లు, ఆరు పబ్బులు, 14 దాబాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సైబరాబాద్‌ ఎస్‌వోటీ డీసీపీ రషీద్‌ తెలిపారు. వారాంతపు తనిఖీల్లో మొత్తం 44 మంది పట్టుబడినట్లు ఆదివారం ఓ ప్రకటనలో వివరించారు. ఐదుగురు బాధిత యువతులకు సంరక్షణ కేంద్రానికి తరలించారు. 100 గ్రాముల గంజాయి, హుక్కా సామగ్రి, 47 ఫోన్లు, 9వాహనాలు, రూ.1,400 నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల్లో ఉల్లంఘనలివీ..

పేట్‌బషీరాబాద్‌ ఠాణా పరిధిలోని లక్ష్మీ విల్లా గెస్ట్‌హౌస్‌లో గంజాయి లభ్యమైంది. వినియోగదారులు సిగరెట్లలో గంజాయి నింపి తీసుకుంటున్నారు. తనిఖీలు చేసి 8 మందిని అరెస్టు చేశారు.

కేపీహెచ్‌బీ హోటల్‌ కార్తికేయ రెసిడెన్సీలో వ్యభిచారం జరుగుతోంది. నిర్వాహకులు రాజు, నరేశ్‌ పరారీలో ఉన్నారు.

శామీర్‌పేట జాస్మిన్‌ ఫాంహౌస్‌లో గంజాయి తీసుకుంటూ 10 మంది చిక్కారు. ఫాంహౌస్‌ యజమాని ముస్తఫా అలీ పరారీలో ఉన్నాడు.

శంషాబాద్‌ అక్రియేషన్‌ ఫాంహౌస్‌లో హుక్కా, మద్యం పట్టుబడింది. పార్టీ నిర్వాహకుడిని అరెస్టు చేశారు.

మెయినాబాద్‌ బ్రౌన్‌టౌన్‌ రిసార్టు మ్యాంగో ఉడ్‌ఫామ్‌లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. వ్యభిచారం జరుగుతోంది. 15 మందిని అరెస్టు చేశారు. కుషీ కర్తే మ్యాంగో ఉడ్‌ పామ్‌లో హుక్కా, మద్యం లభ్యమైంది. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విల్లాల యజమానులు పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు