logo

గృహావసర సిలిండర్లు పక్కదారి.. 101 కేసులు నమోదు

గృహావసర సిలిండర్లను పక్కదారి పట్టించినవారిపై  పౌరసరఫరాల శాఖ కొరడా జులిపించింది. మొత్తం 101 కేసులు నమోదు చేసి సంబంధితుల నుంచి 245 సిలిండర్లను స్వాధీనం చేసుకుంది.

Published : 27 Mar 2023 01:33 IST

సిలిండర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు

ఈనాడు, హైదరబాద్‌:  గృహావసర సిలిండర్లను పక్కదారి పట్టించినవారిపై  పౌరసరఫరాల శాఖ కొరడా జులిపించింది. మొత్తం 101 కేసులు నమోదు చేసి సంబంధితుల నుంచి 245 సిలిండర్లను స్వాధీనం చేసుకుంది. ఇంటి అవసరాలకు ఉపయోగించాల్సిన సిలిండర్లను పక్కదారి పట్టిస్తూ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్లలో దొంగచాటుగా విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండటంతో పాటు ఏజెన్సీదారులకు ఇదో వ్యాపారంగా మారిపోయింది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ జంట నగరాల్లో అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. బీపీసీఎల్‌ కంపెనీకి చెందిన 34, హెచ్‌పీసీఎల్‌కు చెందిన 120, ఐవోసీఎల్‌కు చెందిన 91 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని