logo

డా.రఘురాం ఎంతోమందికి స్ఫూర్తి : హరీశ్‌రావు

నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామ అభివృద్ధికి నిరంతరం తాపత్రయ పడుతున్న పద్మశ్రీ పురస్కార గ్రహీత కిమ్స్‌-ఉషాలక్ష్మి (సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీసెస్‌) డైరెక్టర్‌ డా.పి.రఘురాం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 27 Mar 2023 01:33 IST

సాయం పొందిన బాలికలు, వారి తల్లిదండ్రులతో మంత్రి హరీశ్‌రావు, డా. రఘురాం

సిద్దిపేట, న్యూస్‌టుడే: నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామ అభివృద్ధికి నిరంతరం తాపత్రయ పడుతున్న పద్మశ్రీ పురస్కార గ్రహీత కిమ్స్‌-ఉషాలక్ష్మి (సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీసెస్‌) డైరెక్టర్‌ డా.పి.రఘురాం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇబ్రహీంపూర్‌లో 37 మంది పదేళ్లలోపు ఆడపిల్లలకు డా.రఘురాం సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఖాతాల్లో రూ.27 వేల చొప్పున జమ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సంబంధిత పాస్‌పుస్తకాలు, బాండ్‌ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా నిలిచిన ఇబ్రహీంపూర్‌ ఎన్నో పురస్కారాలు పొందిందన్నారు. ఎనిమిదేళ్ల కిందట రఘురాం దత్తత తీసుకొని గ్రామాభివృద్ధికి నిస్వార్థంగా సేవలు అందించడం అభినందనీయమన్నారు. డా. రఘురాం మాట్లాడుతూ.. పరోపకారంతో ఎంతో పుణ్యం కలుగుతుందని, మంత్రి ద్వారా ఈ విషయం తనకు స్పష్టమైందన్నారు. ఆడపిల్లలు ఎన్ని కష్టాలు పడతారో తనకు తెలుసన్నారు. మంత్రి చొరవతో ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. అనంతరం రఘురాంను మంత్రి సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని